నిన్న ఆర్సీబీతో రాజస్థాన్ రాయల్స్ జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ ఆడింది. రాజస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 174 పరుగుల టార్గెట్ ఇస్తే ఆర్సీబీలో ఛేజింగ్ కోసం కింగ్ విరాట్ కొహ్లీ కొండలా నిలబడిపోయాడు. మొదట ఫిల్ సాల్ట్ తో తర్వాత దేవ్ దత్త్ పడిక్కల్ తో కలిసి రాజస్థాన్ బౌలర్లను గట్టిగా ఓ రౌండ్ వేసుకున్నాడు కొహ్లీ. మొత్తం 62పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు కొహ్లీ. అయితే తన వ్యక్తిగత స్కోరు 54 పరుగుల దగ్గర ఉన్నప్పుడు కింగ్ కొహ్లీ వేగంగా రెండు పరుగులు తీశాడు. వెంటనే కొహ్లీకి బాగా నీరసం గుండెదడ వచ్చాయి అది ఎంతెలా వచ్చాయంటే పక్కనే ఉన్న రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ తో తన హార్ట్ బీట్ చెక్ చేయించుకున్నాడు కొహ్లీ. సంజూ కొహ్లీ గుండెలపై చేయి వేసి అంతా బాగానే ఉందని చెప్పాడు. 36 ఏళ్ల వయస్సున్న కొహ్లీ ఇప్పటికి ఫిటెనెస్ పరంగా పూర్తి ప్రమాణాలను పాటిస్తాడు. మరే టీమ్ మేట్ చేయనంత స్థాయిలో తన ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ ఎప్పుడూ ఫిట్నెస్ ప్రమాణాల్లో తన స్థానాన్ని పెంచుకుంటున్న కొహ్లీ ఇలా గుండె పట్టుకోవటం..హార్ట్ బీట్ చెక్ చేయాలంటూ పక్క టీమ్ కెప్టెన్ ని అడగటం చూస్తుంటే కొహ్లీకి కూడా వయస్సు మీద పడుతుందా అంటూ ఫ్యాన్స్ బాధపడుతూ ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.